Violent Street Fight: ముద్దుపెట్టి నాలుకను కొరికేసిన అమ్మడు, పడిన నాలుకను ఎత్తుకెళ్లిన సిగుల్ పక్షి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, బ్రిటన్‌లో ఆశ్చర్యకర ఘటన

ఆ దేశంలో ఓ మహిళకు పురుషుడికి జరిగిన గొడవలో (Violent Street Fight) పురుషుడు మూగవాడయ్యాడు. ఇది అకస్మాత్తుగా పెట్టిన ముద్దు మూలంగా అంటే నమ్ముతారా... మరి ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది ఆ అమ్ముడు.

Seagull | Image used for representative purpose (Photo Credits: Pixabay)

బ్రిటన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఓ మహిళకు పురుషుడికి జరిగిన గొడవలో (Violent Street Fight) పురుషుడు మూగవాడయ్యాడు. ఇది అకస్మాత్తుగా పెట్టిన ముద్దు మూలంగా అంటే నమ్ముతారా...ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది ఆ అమ్ముడు. ఘటన వివరాల్లోకెళితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్‌‌ (Bethany Ryan) అనే మహిళకు జేమ్స్‌ మెకెంజీలు ( James McKenzie) అనే వ్యకికి మధ్య వీధిలో చిన్న తగువు వచ్చింది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు.

ఈ నేపథ్యంలో మెకెంజీ కొట్టేందుకు ఆమె పైకి వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అదే క్రమంలో మెకెంజీ నాలుక చివరి భాగాన్ని కొరికింది. రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అది పట్టించుకోకుండా ఇద్దరూ గొడవపడుతూనే ఉన్నారు. ఆ తెగిన నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్‌ పక్షి కంట పడింది. దీంతో నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని ఎగిరిపోయింది. అది గమనించిన స్థానికిలు మేకంజీని ఆస్పత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు అతడికి సర్జరీ చేయాలని చూచించారు.

మద్యం తాగించి రెండు రోజులు పాటు యువతిపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, మిగతా ముగ్గురు కోసం గాలింపుల చర్యలు చేపట్టిన పోలీసులు

అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్‌ చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో మెకెంజీ మూగవాడయ్యాడు. దీంతో ర్యాన్‌పై అతడు స్థానికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్‌బర్గ్‌ ఫరీఫ్ కోర్టు ర్యాస్‌ను దోషిగా నిర్థారించి ఆమెకు జరిమాన విధించింది.



సంబంధిత వార్తలు

Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు

CM Revanth Reddy Vs Jagadish Reddy: మీరు నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, అసెంబ్లీలో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ

Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, ఆస్తి కోసం కూతుళ్ల ఫైట్, తల్లికి అంత్యక్రియలు చేయకుండా?, షాకింగ్ ఘటన

Samantha Ruth Prabhu: సమంతకు ధైర్యాన్ని నూరిపోస్తున్న స్నేహితురాలు అల్కేష్, ప్రమాదం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగాలంటూ మోటివేట్