
Mumbai, Feb 22: అత్తాకోడళ్ల (Women Ugly Fight) మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా తరుచూ ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలే. అత్తాకోడళ్ల గొడవలో సాధారణంగా మగవాడు నలిగిపోతాడు. అటు తల్లిని సముదాయించలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేక సతమతమవుతుంటాడు. అందుకే చాలా మంది అత్తాకోడళ్ల గొడవలోకి మగవాళ్లు వెళ్లే సాహసం చేయరు. అయితే, మహారాష్ట్రలోని (Maharastra) నాసిక్ లో అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవలో మగపుంగవులు కూడా ఎంటరయ్యారు. దీంతో అదో పెద్ద ఫైటింగ్ హబ్ గా మారింది. కోర్టు ముందే ఈ కొట్లాట జరుగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MH
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025
అసలేం జరిగిందంటే??
మహారాష్ట్రలోని నాసిక్ లో జిల్లా & సెషన్స్ కోర్టుకి అత్తా కోడళ్లు ఓ వివాదం పరిష్కారం కోసం వెళ్లారు. అయితే కోర్టు లోపలికి వెళ్లకముందే అత్త యమునా యశ్వంత్ నికం అలాగే కోడలు సోదరుడు దీపక్ హిరామన్ సాల్వే మధ్య వాగ్వివాదం మొదలైంది. కాసేపటికే అది మాటల యుద్ధంగా మారింది. దీంతో తన బ్రదర్ ని ఎందుకు తిడుతావని కోడలు ఎంటర్ కాగానే.. అత్తా కోడళ్ల మధ్య గొడవ షురూ అయింది. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకునేవరకూ గొడవ పెరిగింది. ఆ గొడవ మరి కాస్త పెద్దది కావడంతో అత్త తరపు కుటుంబ సభ్యులు, కోడలి తరపు కుటుంబ సభ్యులు కలిసి తమ వంతుగా చితకబాదుకున్నారు. ఎవరు ఎవర్ని కొడుతున్నారో వారికే అర్థం కానట్లు ప్రవర్తించారు. అందులో ఓ వ్యక్తి మహిళ వీపుపై తన్నడం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న కొంతమంది మహిళా పోలీసు అధికారులు, న్యాయవాదులు జోక్యం చేసుకోకుండా.. ప్రేక్షకులుగా మాత్రమే చూడటం గమనార్హం. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.