ips officers (Credits: X)

Hyderabad, Feb 22: ఏపీ క్యాడ‌ర్ (AP Cadre) కు చెంది తెలంగాణ‌లో (Telangana) ప‌నిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌కు (IPS Officers) కేంద్ర హోంశాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర‌ప్రదేశ్‌ లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. శ‌నివారం నాడే ఇది జరుగాలని పేర్కొంది. ఉత్తర్వులు అందుకొన్న వారిలో తెలంగాణ పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్ అభిలాష బిస్త్‌, ర‌హ‌దారి భ‌ద్ర‌త అథారిటీ ఛైర్మ‌న్ అంజ‌నీకుమార్, క‌రీంన‌గ‌ర్ పోలీసు క‌మిష‌న‌ర్ అభిషేక్‌ మ‌హంతి ఉన్నారు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ విభ‌జ‌న అనంత‌రం డిపార్ట్‌ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)... రెండు రాష్ట్రాల‌కు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల‌ను కేటాయించింది.

హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

క్యాట్ కు కొందరు

అయితే ఈ కేటాయింపులు సరిగ్గా లేవంటూ  కొంద‌రు అధికారులు క్యాట్‌ ను ఆశ్ర‌యించారు. దాంతో డీఓపీటీ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. కోర్టు ఖండేక‌ర్ క‌మిటీని నియమించింది. పలువురు ఐపీఎస్ లను ఏపీకి పంపించాలంటూ సదరు కంపిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌ ల‌ను ఏపీకి వెళ్లాల‌ని హోంశాఖ ఆదేశించింది.

ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం