Nissan Recalls Over 8 Lakh SUVs: కస్టమర్లకు షాకింగ్ న్యూస్, ఇంజిన్‌లో లోపం కారణంగా 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోన్న నిస్సాన్
2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది.
ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ ఇంజిన్‌లో లోపం కారణంగా అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. 2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది.ఈ కార్లలో జాక్‌నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్ ఫోబ్‌ను తాకడం, లేదా ఇంజీన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్ తెలిపింది. దీని కారణంగా ఇంజిన్ పవర్ , పవర్ బ్రేక్‌లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్ అవవ్వొచ్చు. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)