Jio Mart Layoffs: ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిన అంబానీ కంపెనీ జియో మార్ట్.. రానున్న కాలంలో మరికొంత మంది
ఉద్యోగుల కోత రిలయన్స్ గ్రూప్ లో కూడా మొదలైంది. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున బీ2బీ వ్యాపారంలో దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Hyderabad, May 23: ఉద్యోగుల కోత రిలయన్స్ గ్రూప్ (Reliance Group) లో కూడా మొదలైంది. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ (Jio Mart) లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున బీ2బీ వ్యాపారంలో (B2B Business) దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జియో మార్ట్ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ తొలగింపులు ఇక్కడికి పరిమితం కావని తెలుస్తోంది. రానున్న మరికొన్ని వారాల్లో కంపెనీ 9,900 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని సమాచారం. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా వ్యాపార మార్జిన్లను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంలో భాగంగా రిలయన్స్ గ్రూప్ తొలగింపుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Advertisement
Advertisement