Chiranjeevi Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి, సినిమా పరిశ్రమ గురించి అడిగారని తెలిపిన మెగాస్టార్

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను..మెగాస్టార్ చిరంజీవి సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు.

Chiranjeevi Visits KCR in Hospital

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను..మెగాస్టార్ చిరంజీవి సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి తనను అడిగారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోనికి తీసుకువెళ్లారు. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement