Aaraattu Teaser: నేను వాడిని చంపేస్తాను, మోహన్ లాల్ లుంగీ కట్టి ఫైట్ చేస్తుంటే..తెలుగు డైలాగ్‌తో ఆరాట్టు చిత్రం టీజర్ విడుదల, దుమ్మురేపుతున్న 53 సెకన్ల నిడివి ఉన్న టీజర్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'.ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను (Aaraattu Teaser) విడుదల చేశారు. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్ టీజర్ తో హీరోను పరిచయం చేశారు.
అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉండగా... అది కూడా తెలుగు డైలాగ్ కావడం విశేషం. టీజర్లో 'నేను వాడిని చంపేస్తాను' అంటూ విలన్ ను మోహన్ లాల్ హెచ్చరించారు . దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్ పాత్ర ఉండి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'ఆరాట్టు' చిత్రానికి బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్ తెలుగు ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్', చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన 'మనమంతా' చిత్రాల్లో మోహన్ లాల్ 'మన్యం పులి' చిత్రం తెలుగులో భారీ విజయం సాధించింది.
టీజర్ మీ కోసం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)