Thalapathy Vijay: సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన నటుడు విజయ్, అభిమానులతో సెల్ఫీలకు పోజులు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు.

Hero vijay

సాధారణ వ్యక్తిలా పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ సైకిల్‌ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్‌ తన ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్‌ బిల్డప్‌ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

అయితే విజయ్‌ సైకిల్‌ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్‌ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్‌ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్‌ సోషల్‌ మీడియా టీం పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..