Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Hyderabad, Jan 20: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PAN India Star Prabhas).. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీన్ని తెరకెక్కిస్తున్నారు. కల్కి మూవీ లో భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానితో పాటు అమితాబ్ సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. మరో క్రేజీ హీరో కల్కి మూవీలో నటిస్తున్నాడన్నది లేటెస్ట్ టాక్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కి మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఓ సన్నివేశంలో తళుక్కున్న మెరుస్తారట. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా మంచి వెయిట్ ఉన్న రోల్ అంటున్నారు. అయితే, దీంట్లో నిజమేంటో తెలియాల్సి ఉంటుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)