Spandana Dies: పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో మరొకరికి గుండె పోటు, హార్ట్ ఎటాక్‌తో నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం
మళయాల ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మృతి చెందారు. బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ బారీన పడటంతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
మళయాల ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మృతి చెందారు. బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ బారీన పడటంతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆమె ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు.
2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు.ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)