Adipurush Dialogue Row: సీతా దేవి జన్మస్థలంపై ముదిరిన వివాదం, ఆదిపురుష్‌తో పాటు అన్ని భారత సినిమాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపాల్

ఆదిపురుష్‌ సినిమా డైలాగులు ఇతర దేశాల్లో వివాదం రేపుతున్నాయి. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'​లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై నేపాల్ రాజకీయ నేతలు మండిపడిన సంగతి విదితమే.

Adipurush Trailer Out

ఆదిపురుష్‌ సినిమా డైలాగులు ఇతర దేశాల్లో వివాదం రేపుతున్నాయి. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'​లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై నేపాల్ రాజకీయ నేతలు మండిపడిన సంగతి విదితమే. ఆ సన్నివేశాన్ని తొలగించమని మూడురోజులు గడువు ఇచ్చినా మేకర్స్‌ ఇప్పటికీ తొలగించలేదని ఫైర్‌ అవుతున్నారు.

మహారాష్ట్రలో ఆదిపురుష్ నిరసనలు, మల్టీప్లెక్స్‌లో సినిమా ప్రదర్శనను నిలిపివేసి, నినాదాలు చేసిన హిందూ సంస్థల సభ్యులు, వీడియో ఇదిగో..

ఆదిపురుష్’తో పాటు ఇండియన్ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి ఖాట్మాండ్‌లో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నిషేధం ఖాట్మాండ్‌ ప్రాంతానికే పరిమితమవుతుందని తెలిపారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now