Amitabh Bachchan Covid Positive: రెండవ సారి కరోనా బారీన పడిన అమితాబ్‌ బచ్చన్‌, తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్

Amitabh Bachchan spotted at Raidurg metro station

అమితాబ్‌ బచ్చన్‌ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేస్తూ.. ఇటీవల తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక​ ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.

కాగా బిగ్‌బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన రష్మిక మందన్నాతో గుడ్‌బై, ఊంచాయి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 2021లో అమితాబ్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌లు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)