Amitabh Bachchan: భారత్ వర్సెస్ ఇండియా వివాదం, భారత్ మాతాకీ జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్, తొలిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ చేర్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Amitabh Bachchan (Photo-Facebook)

ప్రస్తుతం దేశంలో భారత్, ఇండియా అనే పేరుతో వివాదం నడుస్తోంది. జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి ఈ మేరకు తీర్మానం చేయవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

Amitabh Bachchan

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement