Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో నా తమ్ముడికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన చిరంజీవి, వీడియో ఇదిగో..

తాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు.

I am Not going to Pithapuram for Polls campaigning to Support Pawan kalyan says Chiranjeevi

తాను రాజకీయాలకు అతీతమని పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన నిన్న భారత రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న సంగతి విదితమే. ఢిల్లీ నుంచి ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవిని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు.  జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వండి, ముద్రగడ పద్మనాభం లేఖ ఇదిగో..

తాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్‌కు భారతరత్నపై ఆలోచన చేయాలని కోరారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now