NTR Centenary Celebrations: వీడియో ఇదిగో, రజినీకాంత్‌ని కౌగిలించుకుని స్వాగతం పలికిన బాలకృష్ణ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన సూపర్ స్టార్

దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు.

Balakrishna welcomes Rajinikanth to NTR centenary (photo-Video Grab)

దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. 2004లో కృష్ణానది పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు.

ఈ సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ జరగనుంది. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now