Bernard Hill Dies: హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం, టైటానిక్ హీరో బెర్నార్డ్ హిల్ కన్నుమూత
టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు.
టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కెరీర్ తొలి నాళ్లల్లో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గొప్ప గుర్తింపు, అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. స్థానిక కాలమానం ప్రకారం, తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)