Bhagavanth Kesari: వీడియో ఇదిగో, శ్రీలీలతో నటించండంపై బాలకృష్ణకు కొడుకు నుంచి మాస్ వార్నింగ్, ఏందీ డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ..
హీరో బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం వరంగల్’లో భారీగా జరిగింది.
హీరో బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం వరంగల్’లో భారీగా జరిగింది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తాను తొలిసారి తెలంగాణ యాసలో నటించిన చిత్రం భగవంత్ కేసరి అని బాలయ్య అన్నారు.
నా అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని.. ఇక కాజల్, శ్రీలీల నటనని బాలయ్య ప్రశంసించారు. ఆయితే తన తరువాత సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా, నేను హీరోగా చేయాలని ఉందని ఇంట్లో చెబితే మోక్షజ్ఞ నన్ను తిట్టాడని అన్నారు. ఏందీ డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా అని వార్నింగ్ ఇచ్చాడట. బాలయ్య సరదా మాటలకు అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే వరుసగా పాటల్నీ విడుదల చేస్తోంది టీమ్. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఉయ్యాలో ఉయ్యాలా (Uyyaalo Uyyaala) అంటూ సాగే పాటను అక్టోబర్ 4న రిలీజ్ చేశారు. ఈ పాట కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)