Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..
అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Thatha Vasathaade Lyrical Song: కమల్ హాసన్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి అదిరిపోయే బీట్‌ను రిలీజ్ చేశారు. మాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
కాసర్ల శ్యామ్ సాహిత్యం, అరుణ్ కౌండిన్య గాత్రం, అనిరుధ్ బాణీ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాయి. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ, కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు బాగున్నాయి. త్వరలోనే 'భారతీయుడు 2' ట్రైలర్ రాబోతోంది.
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)