'Chhaava' Telugu Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఛావా తెలుగు ట్రైలర్, ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు, వీడియో ఇదిగో..
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ఛావా'. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల అయింది. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ('Chhaava' Telugu Trailer) తెరకెక్కిన సంగతి తెలిసిందే. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న 'ఛావా' బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తోంది.
మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్న ఛావాను ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ధైర్యం, కీర్తిల గొప్ప మేళాయింపుతో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యకావ్యం ఇప్పుడు తెలుగులో వస్తోందంటూ ట్రైలర్‌ను విడుదల చేసింది. గూస్‌బంప్స్ తెప్పించే దృశ్యాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
'Chhaava' Telugu Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)