Lata Mangeshkar Health Update: నిలకడగా లతా మంగేష్కర్‌ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్‌ యాజామాన్యాన్ని కోరానని తెలిపిన మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే

లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

Lata Mangeshkar (Photo Credits: Twitter)

ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్‌ గురించి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే అప్‌డేట్‌ ఇచ్చారు. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్‌ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్‌ టోపే తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement