Ram Gopal Varma: ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ చిక్కులో పడ్డారు.'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు?. అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ బుధవారం (జూన్ 22) ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ చిక్కులో పడ్డారు.'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు?. అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ బుధవారం (జూన్ 22) ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మ ట్వీట్‌పై బీజేపీ నేతలు మండిపడ్డారు. ద్రౌపది ముర్మును కించపరిచేలా ట్వీట్ చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్ వర్మపై అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)