Bruce willis: చికిత్స లేని వ్యాధి బారినపడ్డ ‘డై హార్డ్’ స్టార్ బ్రూస్ విల్లిస్

‘డై హార్డ్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్.. చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు.

Credits: Twitter

Newdelhi, Feb 17: ‘డై హార్డ్’ (Die-Hard) సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్ (67) (Bruce willis).. చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్ భాగాలు క్రమంగా కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement