Director Arpudhan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు అర్పుదాన్‌ మృతి, వార్త ఆలస్యంగా వెలుగులోకి..

ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్‌(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Director Arputham Death: Famous director Arpudhan died in an Road accident Who introduced Raghava Lawrence as Hero

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్‌(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవకాశాల కోసం తిరుగుతున్న రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి 2002లో అద్భుతం అనే సినిమాను తెరకెక్కించారు.

సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అప్పటికే లారెన్స్‌ తెలుగులో హీరోగా సినిమా చేశాడు.అద్భుతం సినిమాతో కోలీవుడ్‌లోనూ హీరోగా మారాడు. ఈ మూవీ రాఘవ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఇక అర్పుదాన్‌.. మనతోడు మళైకాలం, షామ్‌, సెప్పవే సిరుగాలి వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో ఉదయ్‌ కిరణ్‌ హీరోగా లవ్‌ టుడే చిత్రానికి దర్శకత్వం వహించారు.

Director Arputham Death: Famous director Arpudhan died in an Road accident Who introduced Raghava Lawrence as Hero

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)