Esmayeel Shroff Dies: సినీ పరిశ్రమలతో తీవ్ర విషాదం, దిగ్గజ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

Esmayeel Shroff Dies (Photo-Twitter)

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బి-టౌన్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇస్మాయిల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. బాలీవుడ్‌ దర్శకుడు భీమ్‌ సింగ్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ‘అగర్‌’ సినిమాతో దర్శకుడిగా మారారు. తోడీసీ బేవఫాయ్‌, బులంది, అహిస్ట అహిస్ట వంటి హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 2004లో చివరిగా ‘తోడా తుమ్ బద్‌లో తోడా హమ్‌’ అనే సినిమా దర్శకుడిగా పనిచేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement