Producer Mukesh Udeshi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, కిడ్నీ సంబంధిత వ్యాధితో ప్రముఖ నిర్మాత ముకేశ్ ఉద్దేశి మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిరంజీవి హిందీలో నటించిన ప్రతిబంధ్', 'ద జెంటిల్‌మ్యాన్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో 'ఎస్పీ పరశురాం' చిత్రం చేశారు.వీటితో పాటుగా గో గోవా డాన్, ద విలన్, ద షౌకీన్స్, బ్రేక్ కే బాద్, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్, చష్మే బద్దూర్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా చేశారు.
గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన్ని ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ చనిపోవడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)