Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఓపెన్‌హైమర్’ ప్రభంజనం.. ఏయే క్యాటగిరీల్లో అవార్డులు దక్కాయంటే?
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), బెస్ట్ పిక్చర్ (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది.
Newyork, Jan 8: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో (Golden Globes Awards 2024) ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), బెస్ట్ పిక్చర్ (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్ (Christopher Nolan) కు అవార్డులు దక్కాయి. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)