Hyderabad, Jan 8: ప్రజాపాలనలో (Prajapalana) భాగంగా చేపట్టిన అభయహస్తం (Abhayahastham) ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, వెబ్ సైట్ ప్రారంభం, దరఖాస్తుల ప్రాసెసింగ్ కు అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు.
గ్యారంటీలే ప్రాథమ్యాలు
అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు
ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్రెడ్డి సమీక్ష#CMRevanth #AssemblyElections #LokSabhaElections #TeluguNewshttps://t.co/7YERBrM3Zu
— Eenadu (@eenadulivenews) January 8, 2024
నేడే ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర కేబినేట్ భేటీ కూడా జరగనుంది.. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు.#prajapalana #CMRevanthreddy #revanthreddyanenenu #prajaprabhutwam #Telangana https://t.co/tXEfXx9s9X pic.twitter.com/peRHNNlUlE
— ChotaNews (@ChotaNewsTelugu) January 8, 2024
వేటికి ఎన్ని దరఖాస్తులు?
గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. మొత్తం 8 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.