Guntur Kaaram Update: గుంటూరు కారం నుంచి లేటెస్ట్ అప్‌డేట్, అమ్ము.. రమణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ అంటూ సాగే ప్రోమో సాంగ్ విడుదల
”అమ్ము.. రమణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ” అంటూ ఈ ప్రోమో సాగింది. ఇక ఈ సాంగ్ చూస్తే.. రొమాంటిక్ మెలోడి అని తెలుస్తుంది. ఈ పాటను శిల్పా రావు ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం'(Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.
గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అమ్ము.. రమణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ” అంటూ ఈ ప్రోమో సాగింది. ఇక ఈ సాంగ్ చూస్తే.. రొమాంటిక్ మెలోడి అని తెలుస్తుంది. ఈ పాటను శిల్పా రావు ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు ఈ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Here's Promo Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)