Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్ సీన్లపై మండిపడిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.

సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో వున్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్‌గా నవదీప్ వున్నాడని ఆయన చెప్పారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశానని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. రాంచంద్ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. షాడో ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి కూడా పరారీలో వున్నాడని ఆనంద్ వెల్లడించారు.
Here's NTV Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)