Prakash Raj Tweet on Chandrayaan-3: కాస్త ఎదగండయ్యా అంటూ ప్రకాష్ రాజ్ సైటైర్లు, విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన ట్వీట్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందన

చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.

Prakash Raj Tweet on Chandrayaan-3 (Photo-Insta and Twitter)

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు. తానో పాత జోకును గుర్తు చేశానని, తన గత ట్వీట్ నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి పాత జోక్‌‌కు సంబంధించిందని పేర్కొన్నారు.

తాను కేరళ చాయ్‌వాలాపై పోస్టు షేర్ చేశానని, మరి ట్రోల్స్ చేసిన చాయ్‌వాలా ఎవరు? అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి సెటైర్ వేశారు. జోక్‌ను అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అని అనుకుంటారని ఘాటుగా బదులిచ్చారు. కాస్త ఎదగండయ్యా.. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

కాగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యాక చంద్రయాన్ 3 పంపే తొలి ఫొటో ఇదేనంటూ ఓ చాయ్‌వాలా ఫొటోను ప్రకాశ్‌రాజ్ ఆదివారం షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రయాన్ 3 దేశం మొత్తానికి గర్వకారణమని, రాజకీయాన్ని, దేశాన్ని వేర్వేరుగా చూడాలని హితవు పలికారు. ఒకరిని ద్వేషించడం, దేశాన్ని ద్వేషించడం మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకోవాలని సూచించారు.

Prakash Raj Tweet on Chandrayaan-3 (Photo-Insta and Twitter)

Here's His Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)