Jr NTR Congratulates Chandrababu: ప్రియమైన మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ..
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడం విశేషం.
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడం విశేషం. భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం
ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్‌కు, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)