Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఫోన్‌లో మాట్లాడానంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసిన మెగాస్టార్

యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ క‌రోనా వైరస్ బారిన‌ పడిన సంగతి విదితమే. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి ఉండి చికిత్స పొందుతున్నారు.

Jr NTR (Photo Credits: Twitter)

తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయినప్పటీకి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్‌ చిరంజీవి... ఎన్టీఆర్‌ హెల్డ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చి అందర్నీ కూల్ చేశాడు.

ఎన్టీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన ఆరోగ్యంగా బాగానే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అత‌ను, వారి కుటుంబ స‌భ్యులు క్షేమంగా ఉన్నారు .తను చాలా ఉత్సాహంగా, ఎన‌ర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తార‌క్’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now