Jr NTR with kodali Nani: మాములుగా లేదుగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సన్నివేశం చూసి నవ్వులు చిందించిన వల్లభనేని వంశీ

కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

Kodali Nani with NTR

సోష‌ల్ మీడియాలో బుధ‌వారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, వైసీపీ కీల‌క నేత‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, 2014, 2019 ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్ర‌స్తుతం వైసీపీకి స‌న్నిహితంగా మెల‌గుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఉన్నారు. కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.ఈ ఫొటోను చూసిన నంద‌మూరి ఫ్యాన్స్ అయితే త‌మ హీరోల గురించి గ‌త జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now