Rajinikanth Tweet on Kantara: కాంతార సినిమాపై రజనీకాంత్ ట్వీట్ వైరల్, నాకు గూస్‌బంప్స్ తెప్పించారని పొగడ్తల వర్షం

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కాంతార (kantara). సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

Rajanikanth (Credits: Twitter)

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కాంతార (kantara). సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) కూడా చేరిపోయారు.

‘తెలిసిన దానికంటే తెలియనిది ఎక్కువ.. సినిమాల్లో ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరు. కాంతార సినిమాతో నాకు గూస్‌బంప్స్ తెప్పించారు. రిషబ్ శెట్టి ..ఓ రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మీకు హ్యాట్సాఫ్. భారతీయ సినిమాలో అద్భుత కళాఖండం. కాంతార నటీనటులు తారాగణం, టీంకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాంతార చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, నవీన్‌ డీ పడ్లి, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అంజనీష్‌ లోక్‌ నాథ్‌ కాంతార చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now