Kantara Screening At UNO: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
Newdelhi, March 17: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab shetty) స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ (Kantara) సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి (United Nations) కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్ ముగిసిన అనంతరం పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు. భారతీయ సినిమాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయని, తన సినిమా ‘కాంతార’లోనూ ఆ అంశాన్ని ప్రస్తావించినట్టు రిషభ్ చెప్పారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా ‘కాంతార’ రికార్డులకెక్కబోతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)