KK Dies at 53: సింగర్ కేకే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి, ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతిఅ అంటూ ట్వీట్
సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్ కాయ్ అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్(53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్ కాయ్ అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్(53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ‍్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)