Laila Movie Controversy: వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు

లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్‌ తాజాగా క్షమాపణలు చెప్పారు. ఆయన వీడియో విడుదల చేస్తూ.. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు.

SVBC chairman Prudhvi Raj (Photo-Facebook)

లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్‌ తాజాగా క్షమాపణలు చెప్పారు. ఆయన వీడియో విడుదల చేస్తూ.. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు. సినిమాను చంపొద్దని వేడుకున్నాడు. బాయ్‌కాట్‌ లైలా అనకుండా వెల్‌కమ్‌ లైలా అనాలని సూచించాడు.

వైసీపీ కార్యకర్తల దెబ్బ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్, వేధిస్తున్నారంటూ ఫిర్యాదు, వీడియో ఇదిగో..

ఫలక్‌నుమా దాస్‌ కంటే లైలా పెద్ద హిట్‌ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇది చూసిన జనాలు.. ఇప్పటికైనా పృథ్వీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే గొడవ ఇక్కడిదాకా వచ్చేదికాదుగా అని గట్టి పెడుతున్నారు.విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది.

30 Years Prithvi Finally Apologizes

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now