Mammootty Sister Dies: యాత్ర హీరో మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం, అనారోగ్యంతో కన్నుమూసిన సోదరి, ఒకే ఏడాది రెండు విషాదాలతో శోకసంద్రంలో కుటుంబం
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సోదరి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు.
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సోదరి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)