Director Manobala Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో దర్శకుడు మనోబాల కన్నుమూత, వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించిన బాల

కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు

Manobala (photo-Twitter)

తమిళనాడుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల (69) (Manobala) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు.

1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు.

Here's Rajani Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు