Rajnath Singh Meets Prabhas: ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి‌

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.

Rajnath singh meets Prabhas

సినీ నటుడు, బీజేపీ నేత దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

కృష్ణం రాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బీజేపీ నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)