Adipurush: హిందు మత విశ్వాసలను దెబ్బతీసేలా ఆదిపురుష్‌, అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్, తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా

Madhya Pradesh Home minister Narottam Mishra (Photo-ANI)

ఆదిపురుష్‌ టీజర్‌ను వరుసగా వివాదాలు చూట్టుముడుతున్నాయి. టీజర్లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం తోలుతో(లెదర్ తో) తయారు చేసినట్టు చూపించారు. అది హిందు మత విశ్వాసలను దెబ్బతీసేలా ఉంది. హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎలా ఉంటారనేది స్పష్టంగా వివరించబడింది. కానీ దర్శకుడు ఇంకేదో చేసి చూపించారు’ అని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు.ఇలాంటి అభ్యంతకర సన్నివేశాలను దర్శకుడు సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఈ విషయమై దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తానన్నారు. ఇక తమ డిమాండ్‌ మేరకు ఓం రౌత్‌ ఆ సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement