#NBK107: బాలకృష్ణ తర్వాత సినిమాలో విలన్‌గా కన్నడ హీరో దునియా విజయ్, #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో కొత్త చిత్రం, ట్విట్టర్లో షేర్ చేసిన గోపిచంద్
ఈ సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్ చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసారు. ఇక క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విలన్ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది.
అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది.