Nikhil: హీరో నిఖిల్ కొత్త సినిమా లుక్ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే??
హీరో నిఖిల్ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్ ఖరారు చేశారు.
Hyderabad, June 3: హీరో నిఖిల్ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు (Tagore madhu) సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పె భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్ ఖరారు చేశారు. నిఖిల్ యుద్థభూమిలో ఫెరోషియస్ వారియర్‌గా కనిపించారు. పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె), మరొక చేతిలో ఇంకో ఆయుధంతో కనిపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ అద్భుతంగా వుంది. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.
Vishwak Sen: విశ్వక్ సేన్ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్ కా దాస్ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)