NTR University Name Change Row: యూనివర్సిటీకి తాత పేరును తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని వెల్లడి

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు

Jr NTR (Photo Credits: Twitter)

విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు బుధవారం సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించిన విషయం విదితమే. అయితే, వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఈ వ్యవహారంపై స్పందించాడు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు. 'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు' అని తారక్ పేర్కొన్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement