P Balachandran Dies: ప్రముఖ నటుడు పి. బాలచంద్రన్ కన్నుమూత, అంకుల్ బన్ సినిమాతో వెండి తెరకు పరిచయం, కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్న సినీ రచయిత

ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు.

కళా రంగానికి ఆయన అందించిన సేవకుగాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ అనే నాటాకానికి అందుకున్నారు. బాలచంద్రన్‌ నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత థియేరిటికల్ ఆర్ట్స్‌, నటనలో శిక్షణ తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement