Payal Ghosh on Mohammed Shami: నన్ను పెళ్లి చేసుకో అంటూ మహమ్మద్ షమీని అడుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్, కండీషన్స్ అప్లై అంటూ పోస్ట్

ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.

Mohammed Shami and Payal Ghosh (Photo-Insta)

ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.ఆలస్యం చేయకుండా షమీకి పెళ్లి ప్రపోజల్ కూడా చేసింది.

షమీని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని సోషల్ మీడియా వేదికగా పాయల్ తెలిపింది. అయితే ఒక కండిషన్ కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లీష్ ను మెరుగు పరుచుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాయల్ ఘోష్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమాతో ఆమె సినీ పరిశ్రమకు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

Mohammed Shami and Payal Ghosh (Photo-Insta)
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement