RIP Vivek: నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం, తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, వివేక్ మరణం షాక్ కు గురిచేసిందని తెలిపిన డీఎంకే అధినేత స్టాలిన్
‘‘సమయానుసారంగా ఆయన పండించే హాస్యం, డైలాగ్ చాతుర్యం కొన్ని కోట్ల మందిని అలరించాయి. పర్యావరణం, సమాజంపై ఆయనకున్న ప్రేమ ఇటు సినిమాల్లోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయన్ను ఆరాధించేవారికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వివేక్ హఠాన్మరణం ఎందరినో శోకసంద్రంలో ముంచిందని మోదీ పేర్కొన్నారు. గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేరిన వివేక్.. శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.
వివేక్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఆయన లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ఆయన నటన, సామాజిక సేవ చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. తమిళ ప్రజల గుండెల్లో వివేక్ స్థానం పదిలంగా ఉంటుందన్నారు.
వివేక్ మరణం షాక్ కు గురిచేసిందని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. తన నటన, హాస్యంతో ప్రజలకు ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించారన్నారు. కళైనార్ తో వివేక్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రకృతి అంటే ప్రేమించే వివేక్ ను.. ప్రకృతి అంత త్వరగా ఎందుకు తీసుకెళ్లిందో అంటూ విచారం వ్యక్తం చేశారు.
PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)