Salaar Latest Update: ప్రభాస్ కొత్త సినిమా సలార్.. రెండు భాగాల్లో.. కన్ఫామ్ చేసిన సీనియర్ యాక్టర్
బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తదుపరి సినిమా సలార్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Hyderabad, April 17: బాహుబలితో (Bahubali) గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తదుపరి సినిమా సలార్ (Salaar) కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా (Two Parts) రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్ట్ లపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. తాజాగా రెండు పార్ట్ లపై సీనియర్ యాక్టర్ దేవరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఓ కన్నడ ఇంటర్వ్యూలో దేవరాజ్ (Devaraj) మాట్లాడుతూ సలార్ సినిమాలో తాను ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో తన పాత్ర పెద్దగా కనిపించదని, సెకండ్ పార్ట్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించబోతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో సలార్ రెండు పార్ట్ లుగా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)