Actress Dr Priya Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో బుల్లితెర నటి, నిండు గర్భిణి డాక్టర్‌ ప్రియ మృతి

మలయాళ చిత్రపరిశ్రమలో బుల్లితెర నటి రెంజూష మీనన్‌ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి, డాక్టర్‌ ప్రియ(35) గుండెపోటుతో మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది.

Dr Priya (Photo Credits: Instagram)

మలయాళ చిత్రపరిశ్రమలో బుల్లితెర నటి రెంజూష మీనన్‌ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి, డాక్టర్‌ ప్రియ(35) గుండెపోటుతో మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రియను మాత్రం బతికించలేకపోయారు. ప్రియ మరణవార్తను నటుడు కిషోర్‌ సత్య సోషల్‌ మీడియాలో వెల్లడించాడు.

Here's News

 

View this post on Instagram

 

A post shared by Kishor Satya (@kishor.satya)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now