Priyanka Chopra Deepfake: వీడియో ఇదిగో, ఈ సారి డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన ప్రియాంక చోప్రా, నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో

యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది.

Priyanka-Chopra-Deep-Fake

డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్‌ సరసన తాజాగా ప్రియాంక చోప్రా చేరింది. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌ సింక్‌ అయ్యేలా క్రియేట్ చేశారు.ఆ వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్‌ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్‌ చేశారు.

అందులో, 'అందరికీ హాయ్, నేను ప్రియాంక చోప్రాని. నేను నటిస్తాను, మోడల్ చేస్తున్నాను. అలాగే 2023లో రూ. 10,000 లక్షలు సంపాదించాను. సినిమాలు, సంగీతంలో నా ప్రదర్శనలతో పాటు, నేను వివిధ పెట్టుబడి ప్రాజెక్టులలో కూడా డబ్బును వెచ్చించాను.తర్వాత, టెలిగ్రామ్‌లో వారి సలహాను అనుసరించడం ద్వారా,వారి పేరును పేర్కొనడం ద్వారా మీరు వారానికి రూ. 300,000 లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని ఆమె స్నేహితుడి ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించినట్లుగా వైరల్ అవుతోంది. ఈ ఫేక్ ఆడియోపై ప్రియాంక ఇంకా స్పందించలేదు.

Priyanka-Chopra-Deep-Fake

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)